![]() |
![]() |

కార్తీక దీపం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పేరు తెచ్చుకుందో అందరికీ తెలుసు. ఐతే ఈ సీరియల్ లో ప్రస్తుతం మెయిన్ విలన్ రోల్ లో చేస్తున్న మోనితని తప్పించి చారుశీల పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ఐతే ఈమె గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఇప్పుడు మోనిత ప్లేస్ మెయిన్ రోల్ విలన్ గా డాక్టర్ చారుశీలగా నటిస్తోంది. ఈమె అసలు పేరు సౌజన్య. అక్కమొగుడు, బంగారు పంజరం సీరియల్స్ లో నటించింది. ఈమె సిస్టర్స్ శిరీష, హరిత కూడా సీరియల్స్ లో నటిస్తున్నారు. ఈమె సొంత ఊరు తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల. చిన్నప్పటి నుంచి డాన్స్, యాక్టింగ్ అంటే ఇంటరెస్ట్ కారణంగా ఈమె సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సౌజన్య కూడా వరుస సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. "మెట్టినిల్లు" అనే వెబ్ సిరీస్ లో నటించింది. "బావ మరదలు" "ఈ జన్మ నీకే" అనే మూవీస్ లో నటించింది సౌజన్య. ఇప్పుడు కార్తీకదీపంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. కార్తీక్-దీపకి సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తున్న చారుశీల ఇప్పుడు తనలో ఉన్న మరో యాంగిల్ ని బయటపెట్టింది. మోనిత తనను చదివించింది కాబట్టి ఆమె కోరిక ప్రకారం డాక్టర్ బాబు, వంటలక్కను శాశ్వతంగా విడగొట్టడమే తన పని అని..అందుకే దీపకు లేని రోగం అంటగట్టానని చెప్పింది.
అయితే ఇప్పుడు రూటుమార్చి...దీపను చంపేయడమే కాదు..ఆస్తి కోసం కార్తీక్ ను పెళ్లి చేసుకోవడం కోసం స్కెచ్ వేస్తోంది. కానీ ఆడియన్స్ కి మాత్రం చారుశీల క్యారెక్టర్ పెద్దగా నచ్చినట్లు కనిపించలేదు. మరి ఈ క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తారా లేదా స్టోరీలో చేంజెస్ చేసి మోనిత క్యారెక్టర్ ని తిరిగి ప్రవేశపెడతారా అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్..
![]() |
![]() |